*25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోండి
*2 లక్షల వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం
*రూప్ టాప్ సోలార్ జీవిత కాలం 25 సంవత్సరాలు
*ఆధాతో పాటు ఆధాయం
కడప బ్యూరో:నవంబర్ :17 ఆర్ బి ఎన్ న్యూస్
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్ బి ఎన్ సోలార్ అధినేత పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కడప పట్టణంలో ని బ్రాంచ్ ఆఫీసు లో సోమవారం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒక కిలోవాటుకు రూ.30వేలు, 2 కిలోవాట్లకు రూ.60వేలు,3 కిలో వాట్లకు రూ.78వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు.

రూఫ్ టాప్ ఏర్పాటు పూర్తయిన తర్వాత సబ్సిడీ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు 30 రోజుల్లో జమ అవుతుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అయ్యే మొత్తం వ్యయంపై 90% శాతం బ్యాంకులు ఎటువంటి పూచీకత్తు లేకుండా సిబిల్ స్కోర్ ను బట్టి ఎటువంటి ప్రయాసలు లేకుండా రుణం మంజూరు చేస్తారని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తున్నాయని, ఈ రుణం కేవలం ఐదేళ్లలో తీరిపోతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ ను మీరు వాడుకోగా మిగిలిన విద్యుత్ కు ఒక యూనిట్ కు రూ.2.09 పైసల వంతున సంస్థ డబ్బులు చెల్లిస్తుందన్నారు. ఒక్క సారీ రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుంటే సుమారు 30 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పొందవచ్చని ఆధాతో పాటు ఆధాయం పొందవచ్చని అన్నారు ఈ పథకం పై వివరాలకు 9912899966, 9912499966 నెంబర్ల కు సంప్రదించవచ్చని తెలిపారు.
Post Views: 57








