కడప బ్యూరో మే :19: ఆర్ బి ఎన్ న్యూస్
వైస్సార్ కడపజిల్లా బద్వేలు నియోజకవర్గ రెడ్డి సేవాసంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ సంఘటన గత శనివారం చోటు చేసుకొంది.కడప నుంచి చాగలమర్రికి ద్విచక్ర వాహనంలో వెలుతుండగా దువ్వూరు సమీపంలో వాహనానికి బర్రెలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడటంతో సాంబశివారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో కడప పట్టణంలోని విద్యాసాగర్ వైద్యశాలకు తరలించారు. ఆయన వైద్యశాలలో శస్త్రచికిత్సచేయించుకొని చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైట్ టు ఫోరమ్ ఫర్ ఆర్టీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కడప పట్టణంలోని వైద్య శాలకు మంగళవారం
వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట్ర కార్యదర్శి కలువాయి రమణారెడ్డి, ఆర్ ఎఫ్ ఆర్ టి ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లు మోహన్ రెడ్డి ఆర్ బి ఎన్ సోలార్ కంపెనీ ఎచ్ ఆర్ ఎం దివ్యా రెడ్డి, శివ శంకర్ రెడ్డి, పాములేటి, సుశీల, శివ కుమారి, ప్రజ్ఞ తదితరులు ఉన్నారు.









