విశాఖపట్నం, ఏప్రిల్ :11 ఆర్ బి ఎన్ న్యూస్
విశాఖపట్నంలోని తూర్పు ఆంధ్ర యూనివర్సిటీ పాత సి బి ఐ టౌన్, చిన్న వాల్తేరు రోడ్డులో గల మీసేవా కేంద్రం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి విశాఖ జిల్లా రైట్ టు పోరంఫర్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షురాలు రంగోలి గంగాభవాని ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1829లో మహారాష్ట్రలో పూలే అణగారిన వర్గంలో జన్మించిన జ్యోతిరావు పూలే చాలా స్వతంత్రమైన, సమగ్రమైన, ఆధునికమైన అవగాహన ఉన్న సంస్కర్తని, 21 సంవత్సరాలలో ఎదురైన ఒక అనుభవం పూలే జీవితాన్ని మార్చేసిందన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేసిన సంస్కర్త మాత్రమే కాక అణగారిన వర్గాలకు ఎంతో కృషిచేసారని,వారి విముక్తి కోసం ఎంతో కృషి చేశారని, అంతే స్థాయిలో స్త్రీల విముక్తి కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడిన మహానుభావులన్నారు. భారతదేశ సర్వతోముఖాభివృద్దికోసం మన ప్రజల సంకెల్లను చేదించడానికి అవిశ్రాంతంగా పోరాడిన మహత్తర విప్లవ శక్తి ఫూలే అన్నారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సోని, శంకర్, గాయత్రి, రమణమ్మ, రవిశంకర్,సౌత్ కో ఆర్డినేటర్ విజయ లలిత, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.