తృటిలో తప్పిన ఫెను ప్రమాదం

బద్వేలు, ఏప్రిల్ 08 ఆర్ బి ఎన్ న్యూస్

కడపజిల్లా బద్వేలు పట్టణం సిద్దవటం రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపైకీ భారీ కంటైనర్ వాహనం రావడంతో వాహనానికి విద్యుత్ వైర్లు తాకి షార్ట్ సర్క్యూట్ అయ్యి వేలాడుతూ వున్న వైర్లు తెగి రోడ్డుపై పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఎటువంటి ప్రమాదం జరుగకపోవడంతో అధికారులు,ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాహనం తగిలి విద్యుత్ వైర్లు క్రింద కు వేలాడంతో
బద్వేల్-కడప ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచి కాసేపు అంతరాయం ఏర్పడింది.అదే రాత్రి సమయంలో జరిగి ఉంటే భారీ ప్రమాదమే సంభవించేదని,ప్రజల ప్రాణాలతో విద్యుత్ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :