విశాఖ బ్యూరో, ఏప్రిల్ 08 ఆర్ బి ఎన్ న్యూస్
రైట్ టు ఫారం ఫర్ ఆర్టీఐ విశాఖ జిల్లా అధ్యక్షురాలుగా రొంగలి గంగాభవాని ని నీయమిస్తున్నట్లు ఆర్ ఎఫ్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో త్వరితగతిన కమిటీలు ఏర్పాటుచేసి ఆర్ ఎఫ్ ఆర్టీఐ విస్తరణ కోసం తన వంతు కృషి చేయాలని ఆమెను కోరారు. సంస్థ ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని జిల్లాలో విస్తృతంగా సంఖ్యా బలం పెంచి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రతి ఆర్ ఎఫ్ ఆర్టీఐ కార్యకర్తలు,అభిమానులు, సానుభూతిపరులు తమ జీవన విధానంలో ప్రధానంగా పెట్టుకొని నీతి, నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ అవినీతి రహిత సమాజం కోసం సంస్థ ను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా ప్రజల నుంచి గౌరవం,విలువలు వస్తాయన్నారు.